: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావ‌త్‌ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ


ఉత్త‌రాఖండ్‌లో నిన్న జ‌రిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల స‌మావేశంలో త్రివేంద్ర సింగ్ రావ‌త్‌(56)ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు డెహ్రాడూన్‌లో ఆ రాష్ట్ర గవ‌ర్న‌ర్ కేకే పాల్ ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. త్రివేంద్ర సింగ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర‌నేత‌లు హాజ‌ర‌య్యారు.

70 స్థానాలున్న ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల ఫలితాల్లో బీజేపీ 56 సీట్ల‌ను గెలుచుకొని పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాకి సీఎం త్రివేంద్ర చాలా స‌న్నిహితుడు.

  • Loading...

More Telugu News