: కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చిన బీజేపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఈ నోటీసును అందజేశారు. 'గొర్రెల పంపకం' పథకంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సభను పక్కదోవ పట్టించారని నోటీసులో ఆయన అభియోగం మోపారు.