: రాంచీ టెస్టులో శతకంతో అదరగొట్టిన పుజారా
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో పుజారా అదరగొట్టాడు. 218 బంతులను ఎదుర్కొన్న పుజారా సెంచరీ చేశాడు. మరోవైపు కోహ్లీ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే 14 పరుగులకి అవుటయ్యాడు. అనంతరం నాయర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 281 (94 ఓవర్లకి) పరుగులతో క్రీజులో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 3, ఒకెఫ్ 1 వికెట్లు తీశారు.