: రాంచీ టెస్టులో నిరాశపర్చిన విరాట్ కోహ్లీ.. కాసేపటికే పెవిలియన్ చేరిక!
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు గాయపడి, మూడోరోజు క్రీజులోకి వచ్చి అభిమానుల్లో జోష్ పెంచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాసేపటికే నిరాశపర్చాడు. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే కమ్మిన్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి రహానే వచ్చాడు. మరోవైపు పుజారా ధాటిగా ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 75, రహానే 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 233 (83 ఓవర్ల వద్ద) గా ఉంది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ కి 2, ఒకెఫ్కి 1 వికెట్లు దక్కాయి.