: ఏపీకి ప్రత్యేక హోదాతో కవితకు ఏం పని?: కిషన్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము అంతర్గతంగా చెబుతుంటే... టీఆర్ఎస్ ఎంపీ కవిత మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో కవితకు ఏం పని? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు. కేవలం రాజకీయం చేయడానికే కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి చెప్పినట్టు తెలంగాణలో బాహుబలి వస్తాడని చెప్పారు. 

  • Loading...

More Telugu News