: ట్రంప్‌ టవర్‌ కు చెందిన ల్యాప్ టాప్ చోరీ.. అందులో కీలక సమాచారం!


అమెరికాలోని ట్రంప్ ట‌వ‌ర్ కు సంబంధించిన ఓ ల్యాప్‌టాప్‌ను దుండ‌గులు కాజేయ‌డం అల‌జ‌డి రేపుతోంది. అందులో హిల్లరీ క్లింటన్‌ ప్రైవేటు ఈమెయిళ్ల కేసుకు సంబంధించిన వివరాలతో పాటు పోప్‌ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సీక్రెట్‌ సర్వీస్‌ లాప్‌టాప్ ను బ్రూక్లిన్‌లోని బాత్‌ బీచ్‌ ప్రాంతంలో ఓ ఏజెంట్‌ వాహనం నుంచి చోరీ చేశారు. అందులో ట్రంప్‌ టవర్‌ ఫ్లోర్‌ ప్లాన్స్‌తో పాటు కీలక సమాచారం వుంది. అయితే, ఆ సమాచారమంతా ఎన్‌క్రిప్షన్ చేసే ఉందని అక్క‌డి అధికారులు చెప్పారు. స‌ద‌రు ల్యాప్‌టాప్ కోసం  పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ వాహనం నుంచి ల్యాప్‌టాప్‌తో పాటు ఆమె బ్యాగ్‌ను కూడా దొంగిలించార‌ని, అయితే, బ్యాగ్‌, ఇతర వస్తువులను రికవరీ చేసిన‌ప్ప‌టికీ లాప్‌టాప్‌ మాత్రం దొరకలేదని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News