: యూపీ ఎన్నికల్లో మజ్లిస్ కారణంగా ఓటమితో ముస్లింల ఆగ్రహం.. ఒవైసీ దిష్టిబొమ్మ దగ్ధం!
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉండే నియోజక వర్గాల్లో పోటీకి దిగిన మజ్లిస్ పార్టీకి ఘోరపరాభవం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మహారాష్ట్రలోని నాందేడ్‌లో ముస్లింలు మండిపడుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపి ఒవైసీ దిష్టబొమ్మను దగ్ధం చేసి, దాన్ని చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. యూపీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలిపోవడానికి ఒవైసీయే కారణం అంటూ వారు ఆందోళన తెలిపారు. ఒవైసీ తీరుతో ముస్లింల ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీకి లాభం చేకూరిందని వారు అన్నారు. ఒవైసీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.