: అప్పట్లో బాగా సంపాదించా: అమిత్ షా


రాజకీయ దురంధరుడిగా, పొలిటికల్ స్కెచ్ లు వేయడంలో దిట్టగా పేరుగాంచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడుతూ పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. మోదీకి, తనకు గల సంబంధాల విషయంపై ఆయన స్పందిస్తూ... ఒక ప్రధానమంత్రికి, అధికార పార్టీ అధ్యక్షుడికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయో, తమ మధ్య కూడా ఆ సంబంధాలే ఉన్నాయని ఆయన చెప్పారు. తొలినాళ్లలో స్టాక్ మార్కెట్ బ్రోకర్ గా పని చేసిన విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా... ఆ రోజుల్లో తాను బాగా సంపాదించానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మిమ్మల్ని సలహా ఇవ్వమని అడిగితే ఏ సలహా ఇస్తారన్న ప్రశ్నకు బదులుగా... తన జీవితంలో ఈ ఒక్క పని మాత్రం చేయనని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ పార్టీని రాహుల్ నడిపించినంత కాలం మీరు కానీ, మోదీ కానీ భయపడాల్సిన అవసరం ఉండదేమో?' అనే ప్రశ్నకు బదులుగా... తాము ప్రత్యర్థుల బలహీనతలపై ఆధారపడి పని చేయమని, తమ బలంపైనే ఆధారపడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా.

  • Loading...

More Telugu News