: విజయసాయి బెయిల్ పై తీర్పు రిజర్వ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు, ఆడిటర్ విజయసాయి బెయిల్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. బెయిల్ పై తన నిర్ణయాన్ని న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో.. ప్రధాన కుట్ర దారుడు విజయసాయేనని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నేరుగా లబ్ధిపొందనప్పటికీ ఇతర నిందితులకు లబ్ధి చేకూర్చారని వివరించారు. మొత్తం వ్యవహారంలో రూ.40వేల కోట్ల లూఠీ జరిగిందని పేర్కొన్నారు. కూతురి పెళ్లి సమయంలో బయటే ఉంటే తమకు అభ్యంతరం లేదని, పెళ్లి తర్వాత రెండు వారాల్లో సీబీఐ ఎదుట లొంగిపోయేలా విజయసాయిని ఆదేశించాలని సీబీఐ సుప్రీంకు తెలిపింది.