: మా పార్టీని బీజేపీ ఏం చేయలేదు: మమతా బెనర్జీ


పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీని బీజేపీ ఏం చేయలేదని  సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మమతాబెనర్జీని ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోందా? అనే మీడియా ప్రశ్నకు ఆమె పై వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో మూడు లేదా నాల్గో స్థానంలో ఉన్న బీజేపీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? దౌర్జన్యం చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందా?' అని ఆమె ప్రశ్నించారు. విభజించి పాలించే రాజకీయాలకు తమ రాష్ట్రంలో స్థానం లేదని, బీజేపీ నేతలు ఏం చెప్పినా బెంగాలీలు నమ్మరని మమతా ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటే.. దేశ వాప్తంగా వారి పార్టీని టార్గెట్ చేస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News