: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీలోని కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తమ్మీద 99 శాతం పోలింగ్ నమోదైంది. గత 15 రోజులుగా ఆయా పార్టీల శిబిరాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులంతా ప్రత్యేక బస్సుల్లో వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో, పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది.