: రాంచీ టెస్టు: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్‌లో ఆసీస్ ఇచ్చిన 451 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లుగా క్రీజులోకి లోకేశ్ రాహుల్, మురళీ విజయ్ ఆచితూచి ఆడుతున్నారు. రాహుల్ 42 పరుగులతో క్రీజులో ఉండగా, విజయ్ 20 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లకి 62గా ఉంది.