: థ్యాంక్యూ వదిన: సమంతకు అఖిల్ రిప్లై


అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. లొకేషన్స్ వేటలో టీమ్ ఉంది. మరోవైపు, అఖిల్ ఇప్పటి వరకు చేసింది కేవలం ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇతన్ని ఫాలో అవుతున్నవారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది. తాజాగా ట్విట్టర్లో అఖిల్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఒక మిలియన్ కు చేరింది. ఈ సందర్భంగా తన ఫాలోయర్లకు అఖిల్ థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు, వీరంతా తన ఫాలోయర్లు కాదని, తన బిలీవర్స్ అని ట్వీట్ చేశాడు. కాసేపటి తర్వాత సమంత స్పందిస్తూ, 'ఐయాం ఏ బిలీవర్' అంటూ ట్వీట్ చేసింది. దీనికి బదులుగా 'థ్యాంక్యూ వదినా' అంటూ రిప్లై ఇచ్చాడు అఖిల్.

తొలిసారి సమంతను అఖిల్ వదినా అని పిలవడం పట్ల అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య, సమంతలు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News