: ఈ ఫిగర్ ను చూసి టాలీవుడ్ లో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారో???: వర్మ


తన వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాహుబలి-2 ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబైలోని ఐదు అతిపెద్ద కంపెనీలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటున్నాయంటూ తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ వేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాహుబలి-2 ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. దీన్ని 24 గంటల్లో 5 కోట్ల మంది వీక్షించడం ద్వారా భారీ రికార్డు నమోదైంది. దీనిపైనా వర్మ కామెంట్ చేశారు.

ఈ ఫిగర్ (సంఖ్య) చూసి టాలీవుడ్ లో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారో భయంగా ఉందంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రభాస్ అంటే పడని వర్గం వారిని ఉద్దేశించి వర్మ ఈ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. బీబీ2 (బాహుబలి-2) తర్వాత టాలీవుడ్ లో పవర్ ఫుల్ మెగా సూపర్ స్టార్లందరికీ కూడా ప్రభాస్ కాలిగోటి నందుకోవడానికి రెండున్నర జన్మలు పడుతుందంటూ వర్మ ఇప్పటికే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News