: హీరోయిన్ సమంతపై ట్వీట్ చేసిన కేటీఆర్
టాలీవుడ్ నటి సమంతపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చేనేతలను ప్రోత్సహించేలా సమంత ముందడుగు వేయడం హర్షణీయమని ఆయన ట్విట్టర్లో తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పోచంపల్లి, దుబ్బాకల్లో ఆమె పర్యటించడం గొప్ప పరిణామమని చెప్పారు.
మార్చి 10వ తేదీన సిద్ధిపేటలో తెలంగాణ చేనేత ప్రచారకర్త సమంత పర్యటించింది. ఈ సందర్భంగా పలు చేనేత సహకార సంఘాలను పరిశీలించిన ఆమె.. వారి కష్ట సుఖాల గురించి తెలుసుకుంది. ఆ తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి, మగ్గాల మీద నేస్తున్న వస్త్రాలను పరిశీలించింది. అనంతరం 15వ తేదీన భూదాన్ పోచంపల్లి మండలంలోని హ్యాండ్లూమ్ పార్క్ ను సందర్శించింది.