: రేచీకటి వేధిస్తోందా?.. అయితే ఇలా చేయండి!
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అంటారు. కళ్లకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది మరి. కళ్లు లేకపోతే జీవితమే అంధకారం అయిపోతుంది. కారణాలు ఏవైనా కానీ రేచీకటితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. సమతౌల్య ఆహారం తీసుకోకపోవడం, కంటి ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలామందిని రేచీకటి వేధిస్తోంది. పగలంతా బాగానే కనిపించే నేత్రాలు కాస్తా చీకటి అయితే కనిపించడం మానేస్తాయి. దీనికి కారణం రేచీకటి. శరీరంలో కఫం పెరిగిపోవడమే ఇందుకు కారణం. పగలు సూర్య కిరణాల వేడిమికి శరీరంలోని కఫం తగ్గిపోయి కళ్లు బాగా పనిచేస్తాయి. అదే చీకటి పడుతున్న కొద్దీ వేడి తగ్గిపోవడం వల్ల కఫం పెరిగిపోయి చూపు మసకబారుతుంది.
అయితే చిన్నపాటి చిట్కాలతో రేచీకటి బాధ నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణలు. జీలకర్ర చూర్ణాన్ని కండ చక్కెరలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవడం ద్వారా రేచీకటి నుంచి కొంత వరకు ఉపశమనం పొందచ్చు. అలాగే ఉదయం, సాయంత్రం టమాటా రసం తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇక క్యారెట్, తాజా ఆకుకూరలు, టమాటా సూపు తాగడం వల్ల కూడా రేచీకటి నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.