: తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ‘పది’ పరీక్షలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది సేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకోసం ఏపీలో 2,931, తెలంగాణలో 2,556 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,28,081, తెలంగాణలో 5,09,831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.