: చదువు త్వరగా పూర్తి చేయడం లేదని.. కుమార్తె మీద కేసు వేసిన తండ్రి!


సాధారణంగా పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా తల్లిదండ్రులు క్షమించి వదిలేస్తారు. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే అలా కాదు, కన్నపిల్లల అలసత్వాన్ని ఏమాత్రం క్షమించరు. ఆస్ట్రియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చదువుతున్న ఓ యువతి తండ్రి ఆమెపై కోర్టుకెక్కాడు. ఎనిమిది సెమిస్టర్లలో పూర్తిచేయాల్సిన ఆర్కిటెక్చర్ కోర్సును తన కుమార్తె 13 సెమిస్టర్లపాటు చదువుతోందని పిటిషన్ లో ఆ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుపై ఆమె శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపిస్తూ, తన కుమార్తె విద్యకు పెట్టిన మొత్తాన్ని తనకు చెల్లించేలా ఆదేశించాలని ఆయన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. ఆమె విద్యకు చేసిన 24,000 యూరో (16 లక్షల రూపాయ) లతో పాటు కోర్టు ఫీజుకయ్యే 8,000 యూరో (5.6 లక్షల రూపాయ) లు కూడా తిరిగి తనకు చెల్లించేలా ఆదేశించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News