: మార్కెట్ కబుర్లు.. సరికొత్త రికార్డు సృష్టించిన నిఫ్టీ!


దేశీయ మార్కెట్లు ఊపందుకోవడంతో నిఫ్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం రికార్డు మార్కును తాకిన నిఫ్టీ, ఆ రికార్డును నేడు తిరగరాసింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు లాభపడి 29,585 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 9,153 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఎయిర్ టెల్, రిలయన్స్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 

  • Loading...

More Telugu News