: జగన్ కు, రోజాకు భయం పట్టుకుంది: మంత్రి పీతల సుజాత
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత విమర్శలు గుప్పించారు. ప్రచారం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడటం రోజాకు అలవాటేనని, సభా హక్కుల సంఘం అంటే ఆమెకు భయం పట్టుకుందని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్ష నేత జగన్ కు లేదని, ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అందుకే, తమ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని జగన్ భయపడుతున్నారని ఆమె అన్నారు.