: ఫ్రాన్స్ పాఠశాలలో అనుమానిత ఉగ్రవాదుల కాల్పులు.. పలువురికి గాయాలు!
ఫ్రాన్స్ లోని గ్రేస్ పట్టణంలోని ఓ పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయి. సాయుధులైన ముగ్గురు దుండగులు పాల్పడిన కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కాగా, ఫ్రాన్స్ లోని ఐఎంఎఫ్ కార్యాలయంలో కూడా లెటర్ బాంబు పేలింది. ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.