: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి క‌డ‌ప వెళుతున్నా: జగన్


ఈ రోజు శాస‌న‌స‌భ స‌మావేశం వాయిదా ప‌డిన అనంత‌రం లాబీల్లో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీ జ‌రిగిన తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ శాస‌న‌స‌భ జ‌రిగిన తీరు కౌర‌వ స‌భ‌ను త‌ల‌పించిందని విమ‌ర్శించారు. అనంత‌రం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి తాను క‌డ‌ప వెళుతున్నాన‌ని చెప్పారు. క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ ప్ర‌స్తుతం దారుణ‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్పారు. క‌డ‌ప‌ను టీడీపీ నేతలు భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News