: ‘ది కపిల్ శర్మ షో’కు రాజమౌళి, ప్రభాస్, అనుష్క?


ఉత్తరాదిన ఎంతో ప్రజాదరణ పొందిన టీవీ కామెడీ టాక్ షో  ‘ది కపిల్ శర్మ షో’కు బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా ఉత్సాహంగా హాజరవుతుంటారు. సరదా వ్యాఖ్యానాలతో సాగే ఈ షోకు దక్షిణాది భాషల తారలు హాజరైన దాఖలాలు అంతగా లేవనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో, ఈ షోలో ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, ఈ రోజు విడుదలైన ‘బాహుబలి-2’ ట్రైలర్ కు కేవలం ఆరు గంటల్లో డెబ్భై ఆరు లక్షల మంది వీక్షించారు.

  • Loading...

More Telugu News