: ప్రేయసిని పెళ్లాడబోతున్న కరిష్మా కపూర్ మాజీ భర్త.. ప్రియుడితో పెళ్లికి సిద్ధమవుతున్న కరిష్మా!
ఈ బాలీవుడ్ ప్రేమలేంటో, పెళ్లిళ్లు ఏంటో ఒకపట్టాన అర్థమే కావు. చూశామా, ప్రేమించామా, పెళ్లాడామా, పిల్లల్ని కన్నామా, విడిపోయామా, మళ్లీ ప్రేమించామా, మళ్లీ పెళ్లి చేసుకున్నామా... ఇలా తయారైంది బాలీవుడ్. తాజాగా బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ కూడా తన భర్త సంజయ్ కపూర్ తో విడిపోయింది. పిల్లల తల్లి అయిన కరిష్మ తన భర్తతో విడిపోవడం బాలీవుడ్ లో చర్చనీయాంశం కూడా అయింది. వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ తో ప్రేమాయణం నడుపుతున్న నేపథ్యంలోనే, భర్త నుంచి కరిష్మ విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సందీప్ ను తన కుటుంబ సభ్యులకు కరిష్మ పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు, కరిష్మాకపూర్ మాజీ భర్త తన ప్రేయసి ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే... ప్రియాకి ఇప్పటికే విక్రమ్ చత్వాల్ అనే వ్యాపారవేత్తతో పెళ్లయింది. అయితే, ఆమె తన భర్త నుంచి విడిపోయింది. ఇప్పుడు సంజయ్ ప్రేమలో పడి, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది.