: రెండు మూడు నెలలు సెలవులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతా: రాజ‌మౌళి


బాహుబ‌లి లాంటి అద్భుత సినిమాలు తీయ‌డానికి చిన్నప్పటి నుంచి తాను చూసిన ప్రతీ సినిమా, కథలే త‌న‌కు స్ఫూ ర్తి అని ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రామాయణ, భారత కథల స్ఫూర్తి అంద‌రు ద‌ర్శ‌కుల‌లోనూ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. మీడియా కొన్ని సార్లు త‌మ సినిమా బృందంపై విమర్శలు రాసినా, బాహుబ‌లి చిత్రంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదని అన్నారు. ‘బాహుబలి2’ విడుదలైన అనంత‌రం తాను రెండు మూడు నెలలు సెలవులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతాన‌ని చెప్పారు. ఆ త‌రువాతే మ‌రో సినిమా తీస్తాన‌ని చెప్పారు. ‘బాహుబలి-1’ ని మించి రెండో భాగం ఉంటుందని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News