: 6 గంటల్లో 76 లక్షల వ్యూస్‌.. యూట్యూబ్ దుమ్ముదులుపుతున్న ‘బాహుబలి-2’ ట్రైలర్


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ థియేట్రికల్‌ ట్రైలర్ ఈ రోజు విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి విశేష‌స్పంద‌న వ‌స్తోంది. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌లైన ఈ ట్రైల‌ర్ కేవ‌లం ఆరుగంట్లోనే 76 లక్షల మందికి పైగా వీక్షించారు. ట్రైల‌ర్ ద్వారా రాజమౌళి చూపించిన ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. మాహిష్మతి సామ్రాజ్య రాజు బాహుబ‌లి ప్ర‌భాస్‌లో రాజ‌సం ఉట్టిప‌డుతోంది. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటినీ రాజ‌మౌళి చూపించిన తీరుతో గంట‌గంట‌కీ వ్యూస్ ల‌క్ష‌ల్లో పెరిగిపోతున్నాయి. 2015 జూన్ 1 విడుద‌ల చేసిన‌ ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ట్రైలర్ కు ఇప్పటివరకూ కేవలం 78.41 లక్షల వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే, ఆరు గంట‌ల ముందు విడుద‌ల చేసిన‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌కి మాత్రం 76ల‌క్ష‌ల‌కు మించి వ్యూస్ రావ‌డం విశేషమే.

  • Loading...

More Telugu News