: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గంద‌ర‌గోళం.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యుల నినాదాలు


ఏపీ అసెంబ్లీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. అసెంబ్లీలో జ‌గ‌న్ మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రం ఒక్కటే ఇస్తామ‌ని చెప్ప‌లేదని, ప్ర‌త్యేక హోదా కూడా ఇస్తామ‌ని చెప్పిందని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఒక్క‌దాని గురించే మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని ఎందుకు ప‌క్క‌న పెడుతున్నార‌ని ఆయ‌న అడిగారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏది చెబితే దానికి చంద్ర‌బాబు ఓకే అంటున్నారని మండిప‌డ్డారు.

కేంద్ర ప్ర‌భుత్వం తానా అంటే చంద్ర‌బాబు తందానా అంటున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా అంశం ఊసే ఎత్త‌డం లేదని మండిప‌డ్డారు. ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదని అడిగారు. అయితే, ఈ లోగా స‌మ‌యం లేదంటూ, ఆయన ప్రసంగాన్ని ఆపమని, దానిపై స‌మాధానం చెప్పాల్సిందిగా చంద్ర‌బాబుకు స్పీక‌ర్ అవ‌కాశం ఇచ్చారు. అయితే, స్పీక‌ర్ త‌మ‌కు స‌మ‌యం ఇవ్వడం లేద‌ని వైసీపీ సభ్యులు లేచి 'వీ వాంట్ జ‌స్టిస్' అంటూ నినాదాలు చేస్తూ స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. దీంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ గంద‌రగోళం మ‌ధ్యే  ప్ర‌త్యేక హోదా అంశంపై జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News