: పాకిస్థాన్ ఇప్పటికైనా దారికి వస్తుందా...? జమ్మూ కశ్మీర్ లో నదులపై ప్రాజెక్టులు వేగవంతం


భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దేశానికి బుద్ధి వచ్చేలా జమ్మూ కశ్మీర్ లో నదుల ప్రాజెక్టుల నిర్మాణం వేగాన్ని పుంజుకుంది. జమ్మూ కశ్మీర్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లే నదీ జలాలపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుల విలువ 15 బిలియన్ డాలర్లు. తమ దేశానికి వచ్చే నదీ జలాలపై ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి సరఫరా తగ్గుతుందని పాకిస్థాన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, పాక్ హెచ్చరికలను పట్టించుకోవడం లేదని స్థానిక, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. నదీ జలాల పంపిణీ అన్నది భారత వ్యతిరేక ఉగ్రవాదులను నిర్మూలించడం అనే షరతుపైనే ఉంటుందని ప్రధాని మోదీ లోగడే పాక్ కు స్పష్టం చేశారు.

నిజానికి ఈ ప్రాజెక్టులు పాక్ కు నిద్ర లేకుండా చేసేవే. ఎందుకంటే బ్రహ్మపుత్ర, దాని ఉప నదులపై ఆధారపడి పాకిస్థాన్ లో 80 శాతం సాగు భూముల్లో పంటలు పండుతున్నాయి. గత మూడు నెలల కాలంలోనే ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టులు వయబిలిటీ పరీక్షలు నెగ్గాయి. పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియాలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర ఉపనది చినాబ్ నదిపై చేపట్టే ఈ ప్రాజెక్టులతో 3,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్.. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వ అంగీకారానికి భారత్ తూట్లు పొడుస్తోందని అంటూ ఆరోపణలు చేసింది.

  • Loading...

More Telugu News