: అమెజాన్, అలీబాబాలకు చెక్ పెట్టేందుకు ఫ్లిప్ కార్ట్ ప్రయత్నాలు
అమెజాన్, అలీబాబాలకు దీటుగా తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9808కోట్లు) ఫండింగ్ ను పొందడానికి అమెరికాకు చెందిన ఈబే, చైనా టెన్సెంట్ కంపెనీలతో పాటు పలు సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సానుకూలంగా జరిగితే ఆ కూటమితో అమెజాన్, అలీబాబాలకు ప్లిప్‌కార్ట్ గట్టి పోటీనివ్వనుంది.
మూడో ఇన్వెస్టర్ కోసం కూడా కంపెనీ అన్వేషిస్తుందని తెలుస్తోంది. ఈ డీల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈబే ఇండియా బిజినెస్ లను తనలో కలుపుకుంటుందని, లేదంటే కొనుగోలు చేస్తుందని సమాచారం. ఈ విషయంపై ఆయా సంస్థలు మాత్రం స్పందించడం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 400 లేదా 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ గతంలో కూడా 15.2 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను సాధించింది. ఈ తాజా డీల్ తో ఫ్లిప్‌కార్ట్ విలువ మరింత పెరగనుంది.