: అనారోగ్యం కాదు.. సస్పెండ్ చేస్తారనే భయంతోనే రోజా డుమ్మా కొట్టింది: టీడీపీ ఎమ్మెల్యే అనిత
అనారోగ్యంతో బాధపడుతున్నందున... శాసనసభకు హాజరుకాలేకపోతున్నానంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పీకర్ కు లేఖ రాశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పందించారు. రోజాకు ఎలాంటి అనారోగ్యం లేదని... ఆమె సస్పెన్షన్ కు సంబంధించిన నివేదికను ప్రివిలేజ్ కమిటీ సభలో ప్రవేశపెడుతుండటంతోనే ఆమె సభకు డుమ్మా కొట్టారని ఎద్దేవా చేశారు. కమిటీ నివేదికపై చర్చ జరుగుతుందన్న భయంతోనే అనారోగ్యాన్ని ఆమె సాకుగా చూపారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో రోజా తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలతో తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే రోజాతో క్షమాపణ చెప్పించాలని అన్నారు.