: భల్లాలదేవుడిని చూస్తుంటే సాంగ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా? : రానా
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి-2’ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న రానా సరదాగా సమాధానాలు ఇచ్చాడు. బాహుబలి-1 పాటల్లో రానా డ్యాన్స్ కనిపించలేదని, ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహ పడ్డారని విలేకరి అన్నారు. బాహుబలి-2లోనయినా రానా డ్యాన్స్ ఉంటుందా? అని అడిగారు. దీనికి సమాధానం చెప్పిన రానా.. భల్లాలదేవుడిని చూస్తుంటే సాంగ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా? అని అన్నాడు. అమ్మాయిలతో ప్రభాసే డాన్స్ చేస్తాడని, తాను సిన్సియర్‌గా పని చేసుకుంటానని చమత్కరించాడు.