: మయసభలా ఉందంటూ.. ఏపీ కొత్త అసెంబ్లీలో తికమక పడుతున్న మంత్రులు, సభ్యులు!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని అమరావతిలోని వెల‌గ‌పూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీలో స‌మావేశాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, అంతా కొత్త‌కొత్త‌గా ఉండ‌డంతో రాష్ట్ర‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆ భ‌వ‌నంలోకి ఎలా వెళ్లాలో దారి తెలియక అప్పుడప్పుడు కామెడీ సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఉన్న వారి ఛాంబర్లు, కార్యాలయాలు, సభా మందిరం ప్రవేశ ద్వారాల రూట్ల గురించి తిక‌మ‌క ప‌డుతున్నారు. రాష్ట్ర‌ మంత్రి కామినేని శ్రీనివాసరావు శాసనసభకు, మండలికి దారి వెతుక్కుంటూ వెళ్లే క్ర‌మంలో 'ఇదంతా మయసభలా ఉంది క‌దా?' అని త‌న ప‌క్క‌నున్న వారితో అన్నారు. అంతేకాదు, మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా శాస‌న‌స‌భ అనుకొని మండలికి వెళ్లబోయారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబుకి కూడా ఇటువంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

  • Loading...

More Telugu News