: బాహుబలి-2 ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ దృశ్యాలతో అలరిస్తున్న ట్రైలర్... మీరూ చూడండి
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' ట్రైలర్ విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ట్రైలర్ ను విడుదల చేశారు. హైదరాబాదులోని సినీమ్యాక్స్ లో ఈ ట్రైలర్ ను ఈ ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరోలు ప్రభాస్, రానా, దర్శకుడు రాజమౌళి, సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఒక నిమిషం 24 సెకన్ల నిడివి గల తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం, హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ విడుదల చేశాడు. ఆ తర్వాత తెలుగు, మలయాళం ట్రైలర్లను విడుదల చేశారు. మైండ్ బ్లోయింగ్ దృశ్యాలతో ట్రైలర్ అలరిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే అంశాన్ని పొడిగిస్తూ ట్రైలర్ ఉంది.