: బాంబుదాడులతో దద్దరిల్లిన డమాస్కస్.. 25 మందికిపైగా దుర్మరణం
సిరియా రాజధాని డమాస్కస్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కోర్టు భవనంలో ఓ దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇప్పటి వరకు 25 మందికిపైగా దుర్మరణం పాలవగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. కాగా వారం వ్యవధిలోనే ఈ పెద్ద దాడి జరగడం ఇది రెండోసారి. శనివారం షియా పర్యాటకులే లక్ష్యంగా డమాస్కస్‌లో జరిగిన దాడిలో 50 మందికిపైగా మృతి చెందారు. ఆ దాడికి సిరియాకు చెందిన ఆల్ ఖాయిదా శాఖ నుశ్రా ఫ్రంట్ బాధ్యత వహించింది. తాజా ఘటనలో క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.