: ఢిల్లీలో భారీగా బంగారం పట్టివేత!
దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానా శ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పది కిలోల బంగారం పట్టుబడింది. హాంకాంగ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 11.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది రూ.3.42 కోట్ల విలువ చేస్తుందని చెప్పారు.