: చేనేత సహకార సంఘాలను సందర్శించిన సినీ నటి సమంత


తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ఒక చోటుకి చేర్చి ప్రత్యేక సిగ్నిచర్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత పేర్కొన్నారు. ఈ వస్త్రాలను మరింత వినూత్నంగా విభిన్నమైన రంగులతో తయారు చేయాలని, అందుకు గాను కొన్ని డిజైన్లు ఇస్తామని, దాని ప్రకారం తయారు చేసి ఇవ్వాలని ఆమె అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, భూదాన్ పోచంపల్లి, గుండాల ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాలను ఈ రోజు ఆమె సందర్శించారు.

టెస్కో సంస్థకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్, ముంబయి ఫ్యాషన్ డిజైనర్ ప్రీతంతో కలిసి చేనేత వస్త్రాలను ఆమె పరిశీలించారు. గుండాల చేనేత కార్మికులతో ముచ్చటించిన ఆమె, వినూత్నంగా దోమ తెరలు ఎలా తయారు చేయవచ్చో అడిగి తెలుసుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామంలోని హ్యాండ్లూమ్స్ పార్కును సందర్శించిన సమంత, అక్కడి పట్టుచీరలను పరిశీలించారు. 

  • Loading...

More Telugu News