: ఇక ప్రత్యేకహోదా ఊసు వద్దు... ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చింది: సుజనా చౌదరి
ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, స్పెషల్ స్టేటస్ లో వచ్చే అని ప్రయోజనాలు స్పెషల్ ప్యాకేజీ రూపంలో ఏపీకి అందజేయాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా అన్న మాట ఇక మర్చిపోవాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వంద శాతం నిధులను కేంద్రమే భరించనుందని ఆయన చెప్పారు. 2014 తరువాత రాష్ట్రం పెట్టిన నిధులను కూడా కేంద్రమే వెనక్కి ఇవ్వనుందని ఆయన అన్నారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి ప్లానింగ్ ప్రకారం రాష్ట్రం ఉన్నత స్థానంలో నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.