: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్లు వోజెస్, డోహార్తీ


ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్‌ వోజెస్‌, జేవియర్‌ డోహర్తీలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఆసీస్ కు 20 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఆడమ్ వోజెస్, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అరంగ్రేటం చేశాడు. రెండు డబుల్ సెంచరీలు చేసిన వోజెస్ కెరీర్ లో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1,485 పరుగులు చేశాడు. అతని సగటు సర్ డాన్ బ్రాడ్ మన్ తరువాతి స్థానంలో నిలిచింది. 31 వన్డేల్లో ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీల సాయంతో 870 పరుగులు చేసిన వోజెస్, కేవలం ఏడు టీ20లు ఆడి ఒకే ఒక్క అర్ధసెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో సెంచరీ సాధించిన అతి పెద్ద వయస్కుడిగా ఆడమ్‌ వోజెస్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు.

ఇక లెఫ్ట్‌ ఆర్మ్‌ సిన్నర్‌ గా ఆసీస్ తరపున 2010లో అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టిన జేవియర్‌ డోహర్తీ కేవలం నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అలాగే 60 వన్డేల్లో 55 వికెట్లు, 11 టీ20ల్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరూ ఆసీస్ క్రికెట్ కు మంచి సేవలందించారని సీఏ కొనియాడింది. 

  • Loading...

More Telugu News