: మైదానంలోకి దూసుకొచ్చి ధోనీ పాదాలు తాకిన ఓ అభిమాని!
ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చి ధోనీ పాదాలను తాకాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో ధోనీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే, ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో ఉన్న పేపర్ పై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరగా ధోనీ తన సంతకం చేశాడు. ఈ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆ అభిమాని, ధోనీ పాదాలను తాకి ఆయనపై తన అభిమానాన్ని, గౌరవభావాన్ని చాటుకున్నాడు. ఈలోగా, అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ అభిమానిని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు.