: విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని వినతి!
విశాఖపట్టణం నుంచి వారణాసికి ప్రత్యేక రైలు సదుపాయం కల్పించాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి విశాఖ నుంచి వెళ్లే ప్రయాణికులు మార్గ మధ్యంలో వేరే రైలు మారాల్సి వస్తోందని, దాని వల్ల ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వారణాసికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖను ఆయన కోరారు.