: మేడమ్ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ మైనపు విగ్రహం
అంతర్జాతీయ వ్యాక్స్ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ‘మేడమ్ టుస్సాడ్స్’కు ప్రపంచ వ్యాప్తంగా 23 బ్రాంచ్ లు ఉన్నాయి. భారత్ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జూన్ లో ఈ మ్యూజియం బ్రాంచ్ ను ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆమె మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు. ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ, పలువురు బాలీవుడ్ ప్రముఖుల మైనపు విగ్రహాలను ఇప్పటికే ఈ మ్యూజియంలో ఉంచారని, ఆ జాబితాలో తాను కూడా చేరనుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, మ్యూజియం నిర్వాహకులు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా శ్రేయా ఘోషల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని, ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.