: బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం.. చంద్రబాబు వాళ్ల బాబు లోకేశ్‌కి ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదు: రోజా
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆ వాగ్దానాలన్నింటినీ గాల్లో కలిపేసిందని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం కానీ, చంద్రబాబు వాళ్ల బాబు లోకేశ్‌కి ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు.
ప్రతి బడ్జెట్లో రెండు లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పుకుంటున్న సర్కారు.. అందుకు తగ్గట్లు బడ్జెట్ కేటాయింపులు ఎందుకు చేయడం లేదని ఆమె నిలదీశారు. మహిళల మీద అఘాయిత్యాలు ఆపడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మహిళల రక్షణ విషయంలోనూ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయకుండా చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నారని అన్నారు.