: పాక్ లో దాడులు జరిపేందుకు సీఐఏకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
పాకిస్థాన్ లో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా నిఘా సంస్థ (సీఐఏ)కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి అధికారాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ది వాల్ స్ట్రీట్ పత్రిక కథనాలు ప్రచురించింది. ఈ కథనాలతో పాక్ లో ఆందోళనలు నెలకొన్నాయి. తమ దేశంలో అమెరికా మళ్లీ డ్రోన్ల దాడులకు పాల్పడబోతోందనే ఆందోళన మొదలైంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విరుద్ధంగా ఉంది. ఒబామా హయాంలో రక్షణ విభాగం ఆధ్వర్యంలో డ్రోన్లతో దాడి చేసేవారు. సీఐఏ కేవలం నిఘా కోసమే డ్రోన్లను వినియోగించుకునేది. ఇప్పుడు ఏకంగా డ్రోన్లతో దాడులు జరిపేందుకు సీఐఏకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త చర్చనీయాంశం అయింది.