: అమెరికాలో జాత్యహంకార దాడులపై లోక్ సభలో ప్రకటన
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై లోక్ సభలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై ఎఫ్ బీఐ విచారణ జరుపుతోందని ఆమె చెప్పారు. భారత విదేశాంగ శాఖ కూడా అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని తెలిపారు. కూచిభొట్ల శ్రీనివాస్ తదితరులపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖండించారని ఆమె చెప్పారు. దాడుల బాధితులకు న్యాయం జరిగేలా తాము చూస్తామని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు తాము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని సుష్మ చెప్పారు.