: భారీ బడ్జెట్ చిత్రం పద్మావతి సెట్ పై మరో దాడి... పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు


పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న పద్మావతి చిత్రం షూటింగ్‌లో మ‌రోసారి దాడి జ‌రిగింది. ఈ చిత్రంలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నారంటూ ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై ఇటీవ‌లే జైపూర్‌లోని జైగఢ్ కోటలో దాడిచేసిన విష‌యం తెలిసిందే. దీంతో కొన్ని రోజులు వాయిదా ప‌డ్డ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో తిరిగి ప్రారంభ‌మైంది. అయితే, అక్క‌డ వేసిన భారీ సెట్స్‌పై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీంతో సినిమా కోసం వేసిన సెట్స్ పూర్తిగా కాలిపోగా, ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేద‌ని స‌మాచారం. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రాణి ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకొనే, అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగ‌టివ్ రోల్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టిస్తున్నారు.

  • Loading...

More Telugu News