: మీ ఫత్వాలను నేను లెక్కచేయను.. పబ్లిక్ లో పాటలు పాడటం ఆపను: సింగర్ నహీద్ అఫ్రిన్
అసోంకు చెందిన గాయని నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ లో పాటలు పాడవద్దంటూ 46 మంది మత గురువులు ఆమెకు వ్యతిరేకంగా ఫత్వాను జారీ చేశారు. అయితే, ఈ ఫత్వాలను తాను ఏమాత్రం పట్టించుకోనని... పాటలు పాడటం నుంచి తనను ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేసింది. దేశం మొత్తం తనను వెన్నంటి ఉందని తెలిపింది. మరోవైపు ఆమె రక్షణకు అసోం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎంతో ప్రతిభ గల నహీద్ పై ముస్లిం మత పెద్దలు ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. టెర్రరిజం, ఐఎస్ఐఎస్ లకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నహీద్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది.