: రాజకీయ నేత కుమారుడి అరాచకం.. యువకుడిని కారుకు కట్టి ఈడ్చుకెళ్లి చంపిన వైనం
చండీగఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సాకేత్రి అనే గ్రామానికి చెందిన వరీందర్ అనే యువకుడికి స్థానిక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత గురుప్రీత్ కౌర్ వరైచ్ కుమారుడు మన్మీత్ సింగ్‌కు కొన్ని నెలల క్రితం గొడవైంది. దీంతో వరీందర్‌పై పగ పెంచుకున్న మన్మీత్ నిన్న తన స్నేహితులతో కలిసి ఆ యువకుడి ఇంటికెళ్లి దారుణంగా హత్యచేశాడు. ఆ యువకుడు ఇంట్లో భోజనం చేస్తుండగా ప్రవేశించిన మన్మీత్, అతని స్నేహితులు.. అన్నం తింటుండగానే ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు.
అనంతరం ఆ యువకుడిని కారుకు కట్టేసి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్ర గాయాలపాలయిన ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికి ఇద్దరు నిందితులని అరెస్టు చేశారు.