: తొలగిన ఉత్కంఠ.. జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ నుంచి పోటీకి దిగనున్న దినకరన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఆమె మేనకోడలు దీప పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నియోజక వర్గంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు నిలబడతారన్న ఉత్కంఠ నేటితో తొలగిపోయింది. తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును ఆ పార్టీ ప్రకటించింది. శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ను ఎన్నికల పోటీకి దింపుతున్నట్లు పేర్కొంది. దినకరన్ ఇటీవలే అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చేనెల 12న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.