: ఏపీలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: బడ్జెట్ లో నిరుద్యోగులకు యనమల శుభవార్త
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సర్కారు 10వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక, యువత నైపుణ్యాభివృద్ధి కోసం రూ.398 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్లో ఇతర అంశాలు:
* మసీదుల్లో పనిచేసే ఇమామ్లకు రూ.24 కోట్ల కేటాయింపు
* ఖనిజాభివృద్ధి శాఖకు రూ.1,666 కోట్లు
* ఎస్సీల సంక్షేమానికి 9,487
* ఎస్టీల సంక్షేమానికి 3,528
* సూక్ష్మ సేద్యం, ఆయిల్ ఫాం ఇతర రంగాలకు రూ.1,015 కోట్లు
* రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ.1,061 కోట్లు
* పశుగణాభివృద్ధికి రూ.1,112 కోట్లు
* మత్స్యశాఖకు రూ.282 కోట్లు
* చిన్న తరహా పరిశ్రమల శాఖకు రూ.2,086 కోట్లు
* శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.29 కోట్లు
* శాంతి భద్రతలకు రూ.5,221 కోట్లు
* అటవీశాఖకు రూ.383 కోట్లు