: విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది: యనమల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని అన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాజధానిని అమరావతికి తరలించామని అన్నారు. అమరావతిలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని గుర్తుచేశారు. పరిపాలన అమరావతికి రావడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కున్నామని చెప్పారు. ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూనే రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.